NTV Telugu Site icon

IND vs NZ: స్వల్ప ఆధిక్యంలో టీమిండియా.. 263 ఆలౌట్

Ind Vs Nz (1)

Ind Vs Nz (1)

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న మూడు టెస్టు, చివరి మ్యాచ్ కాస్త ఉత్కంఠ రేపుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్‌ 28 పరుగుల ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు రెండో రోజు మొదటి సెషన్ ను బాగానే ఆదింది. ముఖ్యంగా రిషబ్ పంత్ ఎదురు దాడి చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయినా టీమిండియా చేయగలిగిందని చెప్పవచ్చు. అయితే రెండో రోజు రెండో సెషన్‌లో భారత బ్యాట్స్‌మెన్లు తమ లయను నిలబెట్టుకోలేకపోయారు. న్యూజిలాండ్ తరఫున అజాజ్ పటేల్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యధికంగా శుభ్‌మన్ గిల్ 90 పరుగులు చేశాడు. అలాగే రిషబ్ పంత్ 60 పరుగులు చేసాడు.

Read Also: IND vs NZ: ఎదురుదాడి చేస్తున్న టీమిండియా.. లంచ్ సమయానికి 195/5

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ వేగంగా అర్ధ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే 50 పరుగులు చేసి, అదే ప్రత్యర్థి జట్టుపై 41 బంతులు ఆడిన యశస్వి జైస్వాల్ రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ పేరు అగ్రస్థానానికి చేరుకుంది. రిషబ్ పంత్ 114 బంతుల్లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి 96 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న టీమిండియా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. చివరిలో అల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఎదురు దాడి చేసి 38 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.

Read Also: IND vs UAE: ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా

Show comments