India have won the toss and have opted to bat first: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ తెలిపాడు. మరోవైపు కివీస్ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు.
అజేయ రికార్డుతో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత్.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచిన టీమిండియా.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు సెమీస్‍లో గెలిచి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్ భావిస్తోంది. మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఇరు జట్లు ఇప్పటివరకు 117 వన్డే మ్యాచ్‌ల్లో తలపడితే.. ఇందులో భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్‌లలో ఫలితం రాయలేదు. ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు తలపడితే.. భారత్ 5, న్యూజిలాండ్ 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో తలపడడం ఇది వరుసగా రెండోసారి. 2019లో ఇరు జట్లు తొలిసారి సెమీ ఫైనల్లో ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ను 21 పరుగుల తేడాతో కివీస్ ఓడించింది. ఇక వాంఖడే మైదానంలో 21 మ్యాచ్‌లాడిన భారత్.. 12 విజయాలు నమోదు చేసింది. ఇక్కడ 9 మ్యాచ్‌ల్లో ఓడింది.
Also Read: IND vs NZ Semi Final: భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. వాంఖడేకు క్యూ కట్టిన సెలెబ్రిటీస్!
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.