NTV Telugu Site icon

IND vs NZ: భారత్ అత్యల్ప స్కోరు.. క్షమాపణలు చెప్పిన రోహిత్.. తప్పు ఎక్కడ జరిగిందంటే?

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయింది. 92 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా స్వదేశంలో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర (22 బ్యాటింగ్), డారిల్ మిచెల్ (14 బ్యాటింగ్‌) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగియగానే.. అభిమానులకు కెప్టెన్ రోహిత్‌ శర్మ క్షమాపణలు చెప్పాడు.

READ MORE: Andhra Pradesh: మందుబాబులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్!

దీంతో పాటు తప్పు మ్యాచ్‌లో జరిగిందో వివరించాడు. పిచ్‌ను అంచనా వేయడంలో తాము పెద్ద తప్పు చేశానని రోహిత్ శర్మ అన్నాడు. ఎలాంటి అంచనాలు వేయకుండా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నామని అన్నాడు. పిచ్‌పై జరిగే తొలి సెషన్‌ క్లిష్టంగా ఉంటుందని తాను భావించానని, అయితే అది జరగలేదని రోహిత్ చెప్పాడు. “కెప్టెన్‌గా 46 పరుగుల స్కోరు చూసి బాధపడ్డాను. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం నాదే. నేను చెప్పినట్లు పిచ్ అంతగా పచ్చిక (గడ్డి) లేదు. అందుకే కుల్దీప్ (స్పిన్నర్ కుల్దీప్ యాదవ్)ని మ్యాచ్‌లో చేర్చాలని అనుకున్నాం. కుల్దీప్ ఫ్లాట్ పిచ్‌లపై బౌలింగ్ చేసి వికెట్లు తీసేవాడు.” అని రోహిత్ అన్నాడు.

READ MORE:Israel: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతం..! మీడియాలో జోరుగా ప్రచారం

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ మరియు విలియం ఒరూర్క్.