Rohit Sharma: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు సాధ్యం కాలేదు.. రోహిత్ శర్మ అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India beat New Zealand in ICC tournament after 20 years: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచిన రోహిత్ సేన సెమీస్‌కు మరింత చేరువైంది. ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దాంతో గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా చెక్ పెట్టింది. అంతేకాదు 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకుంది.
2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై భారత్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 146 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్స్ కోల్పోయి మరో 10 ఓవర్లు ఉండగానే ఛేదించింది. అప్పటినుంచి ప్రపంచకప్‌లో భారత జట్టుపై కివీస్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ విజయాన్నందుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. మ్యాచ్‌లు కివీస్ నెగ్గగా, భారత్ నాలుగింటిలో గెలిచింది. మాజీ సారథులు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు సాధ్యం కానిది రోహిత్ శర్మ చేసి చూపాడు. రోహిత్ శర్మ అదుర్స్ అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (130; 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (75; 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ (5/54) ఐదు వికెట్లతో చెలరేగాడు. లక్ష్య చేధనలో భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (95; 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. రవీంద్ర జడేజా (39 నాటౌట్; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!