NTV Telugu Site icon

IND vs NZ: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మల్టీఫ్లెక్స్‌లలో లైవ్ స్ట్రీమింగ్

Ind Vs Nz

Ind Vs Nz

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈనెల 9న (ఆదివారం) దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారత్ అభిమానులకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే.. టీమిండియా మ్యాచ్ కోసం ఎక్కడికైనా, ఏ స్టేడియానికైనా వెళ్లి వీక్షిస్తారు. స్టేడియానికి వెళ్లి వీక్షించలేని వారు.. భారత్ మ్యాచ్ కోసం ఏ పని ఉన్నా పక్కన పెట్టి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కపోతారు. ఇక.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ తలపడుతుందంటే.. ఇంకేముంది ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి స్టేడియంకు వెళ్లి చూసే వారుంటారు. అంతేకాకుండా.. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి టీవీలకే అతుక్కుపోయే వారుంటారు.

Read Also: Ranveer Allahbadia: మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన రణ్‌వీర్‌ అల్హాబాదియా

గతంలో అభిమానుల కోసం ఐపీఎల్ మ్యాచ్‌లను కొన్ని నగరాల్లో బిగ్ స్క్రీన్లు పెట్టి తిలకించారు. తాజాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ కోసం హైదరాబాద్ నగరంలో అభిమానులకు ఓ కిక్కిచ్చే వార్త బయటికొచ్చింది. నగరంలోని మల్టీఫ్లెక్స్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఇప్పటికే నగరంలోని పలు మల్టీఫ్లెక్స్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా.. వినూత్న అనుభవం కోసం క్రికెట్ అభిమానులు నిరీక్షణ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులందరూ ఫైనల్‌లో టీమిండియా గెలువాలని కోరుకుంటున్నారు.

Read Also: Harish Rao: ఆనాటి నీటి గోస దృశ్యాలను ఈ ప్రభుత్వం మళ్లీ చూపిస్తుంది..