పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో రెండో టెస్ట్ ఆడుతున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు. గాయంతో మాట్ హెన్రీ దూరం కాగా.. మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అందరూ అనుకున్నట్లే కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి…