Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు కీలక మార్పులతో బరిలోకి దిగింది. గాయం కారణంగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కి దూరం కాగా, ఆయన స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో ఆడే అవకాశం దక్కింది.
ఈ మ్యాచ్‌లో వైభవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధ్రువీకరించాడు. టీ20 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా ఆడే వైభవ్ ఎంట్రీ జట్టు బ్యాటింగ్ లైన్-అప్‌కు మరింత బలాన్ని చేకూర్చనుంది. మరొక మార్పుగా వ్యూహాత్మకంగా మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజూ శాంసన్ నిర్వర్తించనున్నాడు.
Also Read
- Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
- Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. పేసర్ మిల్నే స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నట్లు కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. రాబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని బౌలర్లకు విశ్రాంతినిస్తూ రోటేషన్ పద్ధతిని పాటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. రెండు జట్లు కూడా విజయం సాధించడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
భారత తుది జట్టు: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
న్యూజిలాండ్ తుది జట్టు: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గ్యూసన్
తాజావార్తలు
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!