IND vs GER: సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి.. కాంస్యం కోసం భారత్ పోరు!
- కీలక సమరంలో భారత్ తడబాటు
- జర్మనీ చేతిలో 2-3తో ఓటమి
- స్పెయిన్‌తో కాంస్యం పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Spain Fight for Bronze in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో ఆశలు రేపిన భారత పురుషుల హాకీ జట్టు కీలక సమరంలో మాత్రం తడబడింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ చేతిలో 2-3తో ఓడిపోయింది. సూపర్ ఫామ్‌తో సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ సేన.. కీలక పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ పోరులో జర్మనీని ఓడించి భారత్ కాంస్యం నెగ్గగా.. ఈ విజయంతో ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
Also Read: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. వినేశ్ ఫొగాట్ టార్గెట్ గోల్డ్!
Also Read
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
సెమీస్ మ్యాచ్‌ను భారత్ ధాటిగా ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా చివరి క్వార్టర్లో భారత ప్లేయర్స్ తేలిపోయారు. దాంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ), సుఖ్జీత్ (36వ) చెరో గోల్ కొట్టారు. జర్మనీ తరఫున గొంజాలో (18వ), క్రిస్టొఫర్ (27వ), మార్కో (54వ) గోల్స్ చేశారు. భారత్ చివరిసారి 1980లో ఒలింపిక్స్‌లో ఫైనల్ ఆడింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ 4-0తో స్పెయిన్‌ను ఓడించింది. ఇక భారత్ కాంస్య పతకం కోసం ఆగష్టు 8న స్పెయిన్‌తో తలపడుతుంది. కాంస్య పతకం అయినా గెలవాలని భారత్ ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!