IND vs ENG: నేడే సెమీఫైనల్-2.. ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేది ఎవరో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ENG: టీ20 వరల్డ్ కప్ 2026లో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. టోర్నీ సెమీఫైనల్-2లో నేడు భారత్–ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వానఖేడే స్టేడియం వేదికగా జరిగే ఈ పోరు ఫైనల్ బెర్త్ ను ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఫైనల్ లో న్యూజిలాండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధం అవుతుంది.
ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా, హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగనున్నాయి. వరుసగా మూడో టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఈ రెండు జట్లు తలపడటం విశేషం. గడించిన రెండు వరల్డ్ కప్ లలో.. 2022లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి ఫైనల్ చేరగా, 2024లో గయానాలో దానికి భారత్ ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ చేయి కప్ ను సొంతం చేసుకుంది.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
ఇకపోతే ఈ మ్యాచ్ లో వాతావరణం కూడా కీలక పాత్ర పోషించనుంది. ఒకవేళ వర్షం అడ్డంకిగా నిలిచి మ్యాచ్ నిలిచిపోతే రిజర్వ్ డేను కేటాయించారు. ఇందుకోసం గురువారం నాడు అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల అదనపు సమయం ఉంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫలితం నిర్ణయిస్తారు. ఆ పరిస్థితిలో సూపర్-8 గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ ఫైనల్‌కు అర్హత సాధించి న్యూజిలాండ్‌తో తలపడుతుంది. భారత్ సూపర్-8 గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచింది. కాబట్టి భారత్ టోర్నీ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే నేడు ముంబైలో వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు. దీంతో పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
పిచ్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో ఈ గ్రౌండ్ లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్‌లో వెస్టిండీస్ 196 పరుగులు కాపాడుకోగా, మరో మ్యాచ్‌లో ఇటలీ 123 పరుగులకు నేపాల్‌ను ఆలౌట్ చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై మరో హైస్కోరింగ్ థ్రిల్లర్ చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడే జట్టు ఏదో నేడు తేలనుంది.
SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు
ప్లేయింగ్ XI జట్లు: (అంచనా)
భారత్: సూర్యకుమార్ యాదవ్ (C), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (W), శివం దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.
ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్ (C), రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జేకబ్ బెతెల్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!