Rohit Sharma: అతడి వల్లే ఓడిపోయాం.. ఉప్పల్ టెస్ట్ ఓటమిపై రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on Hyderabad Test Defeat: హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌కు షాక్ తగిలింది. ఆదివారం నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ (7/62) దెబ్బకు టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో ఆరంభమవుతుంది. భారత్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలి పోప్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడని ప్రశంసించాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచ్‌లో ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించడం కష్టం. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో ఇక గేమ్ మాదే అనుకున్నాము. కానీ ఓలి పోప్ అసాధారణ బ్యాటింగ్‌తో మాకు విజయాన్ని దూరం చేశాడు. భారత పరిస్థితుల్లో నేను చూసిన ఓవర్సీస్ ప్లేయర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ పోప్‌దే. పోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 230 పరుగులు పెద్ద లక్ష్యమేమి కాదు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించిది. కానీ మేము బ్యాటింగ్‌లో విఫలమకావడంతో టార్గెట్‌ను ఛేజ్ చేయలేకపోయాం’ అని తెలిపాడు.
Also Read
- Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
- Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
- Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
- Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
Also Read: Filmfare Awards 2024: ‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట.. ఉత్తమ నటుడు రణ్‌బీర్ కపూర్!
‘మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రణాళికలను అమలు చేయడంలో బౌలర్లు విజయవంతమయ్యారు. మేం ఏ ప్రదేశాల్లో బౌలింగ్ చేశామో స్వయంగా వెళ్లి పరీక్షించాను. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశాం. కానీ ఓలి పోప్ అద్భుత పోరాటంతో అడ్డుగా నిలిచాడు. మేము ఒక టీమ్‌గా విఫలమయ్యాం. నేను మ్యాచ్‌ను ఐదో రోజు వరకు తీసుకువెళ్లాలనుకున్నాను. కానీ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. మా లోయర్డ్ ఆర్డర్ బ్యాటర్లు ఆఖరివరకు పోరాడారు’అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!