Site icon NTV Telugu

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియా స్టార్‌ ప్లేయర్ ఔట్!

Ravindra Jadeja Likely to miss IND vs ENG 2nd Test in Vizag: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో రన్ తీసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో జడ్డు రనౌట్‌ అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా మారాడు. జడేజాను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. జడ్డు గాయం తీవ్రతపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read: Rohit Sharma: అతడి వల్లే ఓడిపోయాం.. ఉప్పల్ టెస్ట్ ఓటమిపై రోహిత్ శర్మ!

హైదరాబాద్ టెస్ట్‌లో ఓడిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. రవీంద్ర జడేజా గాయంపై స్పందించేందుకు నిరాకరించాడు. ‘గాయం గురించి చూడాలి. నిజాయితీగా చెప్పాలంటే.. నేను ఫిజియోతో ఇంకా మాట్లాడలేదు. ఫిజియోతో మాట్లాడిన అనంతరం గాయం గురించి ఆలోచిస్తాం’ అని ద్రవిడ్ తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్స్, 87 రన్స్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్స్, 2 పరుగులు చేశాడు. విశాఖ వేదికగా రెండో టెస్ట్‌ ఫిబ్రవరి 2 నుంచి ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్లేయర్స్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

Exit mobile version