Site icon NTV Telugu

IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!

Ind Vs Eng Test

Ind Vs Eng Test

IND vs ENG Test: ఇంగ్లాండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండవ రోజు లంచ్ సమయానికి పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ తొలి ఇన్నింగ్స్‌ లో 110 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (1), శుబ్‌మన్ గిల్ (168) క్రీజ్‌లో ఉన్నారు. ఇక భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్‌తో 168 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. మొత్తంగా గిల్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. తొలి రోజు సెంచరీ చేసిన గిల్‌ రెండో రోజు కూడా అదే రీతిలో ఆడుతూ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

Read Also:Oppo Reno 14 Pro 5G: మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!

ఇక మరోవైపు ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా ఈ టెస్టులో మరోసారి తన అవసరాన్ని నిరూపించుకున్నాడు. జడేజా 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 89 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. కానీ 107వ ఓవర్లో జాష్ టంగ్ బౌలింగ్‌లో కీపర్ జేమీ స్మిత్‌ కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మొదటిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 87 (13 ఫోర్లు) తో మెరిశాడు. అయితే కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషభ్ పంత్ (25), నితీష్ కుమార్ రెడ్డి (1)లు మాత్రం విఫలమయ్యారు.

Read Also:OPPO Reno 14: 6200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా, అద్భుత AI ఫీచర్లతో వచ్చేసిన ఒప్పో రెనో 14..!

ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జాష్ టంగ్, షోయబ్ బషీర్ చెరో వికెట్ తీశారు. ఇక ప్రస్తుత పరిస్థితిలో భారత్ మంచి స్కోర్ దిశా సాగుతుంది. కెప్టెన్ గిల్ కు టైలెండర్ల నుండి తొడపాడు లభిస్తే మరింత మెరుగైన స్కోర్ సాధించగలదు. చూడాలి మరి లాంచ్ తరువాత మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో.

Exit mobile version