Indian Team Net Practice Video Goes Viral: భారత్, ఇంగ్లండ్ జట్ల 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25న మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. టెస్టు సిరీస్‌ని విజయంతో ఆరంభించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై రోహిత్ సేనను చిత్తుగా ఓడించేందుకు ఇంగ్లండ్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రస్తుతం ఇరు జట్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కఠోర సాధన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా నెట్ ప్రాక్టీస్ వీడియో ఒకటి వైరల్ అయింది.
మంగళవారం టీమ్ హోటల్ నుంచి భారత జట్టు ఉప్పల్ స్టేడియానికి వెళ్లింది. మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. లోకల్ బాయ్ మొహమ్మద్ సిరాజ్, ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. రాహుల్ కీపింగ్ కూడా సాధన చేశాడు. అనంతరం ఆటగాళ్లంతా మైదానంలోనే రిలాక్స్ అయ్యారు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదటి టెస్టుకు సమయం ఆసన్నమైంది అని క్యాప్షన్ ఇచ్చింది.
Also Read: IND vs ENG: ఉప్పల్ టెస్ట్ మ్యాచ్.. ఇంగ్లండ్‌ను హెచ్చరించిన బుమ్రా!
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్ కేప్‌టౌన్‌లో చిరస్మరణీయ విజయం సాధించింది. న్యూలాండ్స్‌లో జరిగిన రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా 8, మొహమ్మద్ సిరాజ్ ఏడు వికెట్లతో చెలరేగడంతో సునాయాస విజయం అందుకుంది. అంతేకాదు న్యూలాండ్స్‌లో గెలుపొందిన తొలి ఆసియా జట్టుగా రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. ఆ విజయంతో జోష్ మీదున్న భారత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించేందుకు సిద్దమైంది. 2012 తర్వాత స్వదేశంలో ఇంగ్లీష్ జట్టుపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోని భారత్.. ఆ రికార్డును కొనసాగించాలని చూస్తోంది.
When it’s almost “time” for the first Test ⏳#TeamIndia | #INDvENG | @IDFCFirstBank pic.twitter.com/QbswZ1AMWZ
— BCCI (@BCCI) January 23, 2024