NTV Telugu Site icon

IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. షకీబ్ ఔట్! తుది జట్లు ఇవే

Untitled Design (3)

Untitled Design (3)

World Cup 2023 India vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్‌ జట్లు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లా కెప్టెన్‌ షకీబ్ ఉల్ హాసన్ గాయంతో దూరం కాగా.. నజ్ముల్‌ శాంటో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. షకీబ్‌ స్థానంలో నసుమ్‌, తస్కిన్‌ స్థానంలో హసన్‌ తుది జట్టులో వచ్చారు. మరోవైపు భారత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది.

హ్యాట్రిక్‌ విజయాలతో కొనసాగుతున్న టీమిండియాను ఢీకొట్టడం బంగ్లాకు అంత తేలికైన విషయం కాదు. అయితే సంచలనాలు నమోదవుతున్న ఈ ప్రపంచకప్‌లో ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. భారత్ అప్రమత్తమంగా ఉండకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్‌, బంగ్లాదేశ్‌ తలపడిన చివరి నాలుగు వన్డేల్లో మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓడింది. చివరగా ఆసియా కప్‌ 2023 సూపర్‌-4 దశలో భారత్ ఓటమి చవిచూసింది.

Also Read: IND vs BAN: టీమిండియాపై అద్భుత రికార్డులు.. భారత్‌ను బయపెడుతున్న ముగ్గురు బంగ్లాదేశ్‌ ప్లేయర్స్!

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్‌), నసుమ్‌ అహ్మద్‌, మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్‌), తౌహిద్ హృదొయ్, మెహది హసన్, హసన్‌, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.