సిరీస్‌ల మధ్య విరామాలు తీసుకోవాలని, అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం ప్రాక్టీస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదని యాష్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు విజయంలో కీలక…