ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా (38) ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (75; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. శుభ్‌మన్ గిల్ (29; 19 బంతుల్లో) రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 2.. ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: King Cobra: కింగ్ కోబ్రా పాములు మనుషుల కంటే వేగంగా పరుగెత్తగలవా?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. మొదటి రెండు ఓవర్లలో 10 రన్స్ మాత్రమే చేసిన ఓపెనర్లు.. మూడో ఓవర్ నుంచి గేర్ మార్చారు. ముందుగా శుభ్‌మన్ గిల్ రెచ్చిపోగా.. ఆపై అభిషేక్ శర్మ ఊపందుకున్నాడు. ఈ ఇద్దరు దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 72/0తో నిలిచింది. దాంతో టీమిండియా భారీ స్కోరు చేసేలా కనిపించింది. తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శివమ్ దూబె (2), సూర్యకుమార్ యాదవ్ (5), తిలక్ వర్మ (5) త్వరగా పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (10 నాటౌట్) పరుగులు చేశారు.
