Site icon NTV Telugu

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’!

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్‌ (మూడు ఫార్మాట్స్)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు.

ఇంతకుముందు ఈ రికార్డు హాంకాంగ్ పేసర్ ఎహ్సాన్ ఖాన్ పేరిట ఉంది. ఎహ్సాన్ 27 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు తీశాడు. తాజాగా ఎహ్సాన్‌ను జస్ప్రీత్ బుమ్రా అధిగమించాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా (43), ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (41), బంగ్లాదేశ్‌ పేసర్ తస్కిన్ అహ్మద్ (36) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో మరో టెస్ట్ ఉన్న నేపథ్యంలో బుమ్రా 50 వికెట్ల మార్కును అందుకోనున్నాడు. బంగ్లాదేశ్‌ సిరీస్ అనంతరం భారత్ న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో కూడా మ్యాచులు ఆడనుంది.

Also Read: IPL 2025: ఫ్రాంచైజీల డిమాండ్‌కే బీసీసీఐ మొగ్గు.. ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చంటే?

ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లట్స్ తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్‌ తీశాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 36 టెస్టులు, 89 వన్డేలు, 70 టీ20లు ఆడాడు. వరుసగా 159, 149, 89 వికెట్స్ పడగొట్టాడు.

 

Exit mobile version