IND vs AUS: ఎందుకు అతడి కెరీర్‌తో ఆడుకుంటున్నారు.. శ్రీకాంత్ అసంతృప్తి!
- ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్
- రుతురాజ్ గైక్వాడ్‌కు దక్కని చోటు
- అవకాశం రాకపోతే ఇంకేం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. దాంతో సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ వచ్చాయి. రుతురాజ్ యెల్లో జెర్సీ (చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ) వేసుకోవడం వల్లే ఎంపిక చేయలేదని కామెంట్లు చేశారు. రుతురాజ్‌ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లకు జట్టును నడిపించే రుతురాజ్.. ప్రధాన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. భారీగా పరుగులు చేసినా అవకాశం రాకపోతే ఇంకేం చేయాలి? అని ప్రశ్నించాడు.
కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘భారత క్రికెట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మయాంక్ యాదవ్ నెట్స్‌లో కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ వేస్తున్నాడని చెప్పారు. చివరకు శివమ్ దూబె, రియాన్ పరాగ్ మాదిరిగా ఫిట్‌గా లేడని ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ విషయంలో ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా?. అతడికి కూడా ఎందుకు ఎంపిక కావడం లేదో తెలియదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సెంచరీలు చేసినా టెస్టుల్లో అవకాశం రాలేదు. భారీగా పరుగులు చేసినా అవకాశం రాకపోతే ఇంకేం చేయాలి?’ అని ప్రశ్నించాడు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
Also Read: IPL Retention 2025: కేఎల్ రాహుల్‌కు షాక్.. లక్నోకు కొత్త కెప్టెన్!
‘దేశవాళీ క్రికెట్లో సెంచరీలు చేసిన అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకోవడం మంచి నిర్ణయం. కానీ రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడంలో లాజిక్ ఏంటో సెలెక్టర్లు చెప్పాలి. ఎందుకు అతడి కెరీర్‌తో ఆడుకుంటున్నారు?. రుతురాజ్ నుంచి ఇంకేం ఆశిస్తున్నారో చెప్పాలి. మీ ప్రణాళిక ఏంటి?.. ప్రత్యర్థిపై రోజంతా హిట్టింగ్ చేయగల సత్తా ఉన్న బ్యాటర్. కానీ అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చేసరికి మీరు పక్కన పెట్టేస్తున్నారు. రుతురాజ్‌కు కేవలం రెస్టాఫ్ ఇండియా లేదా ఇండియా-ఏ తరఫున మాత్రమే అవకాశం ఇస్తారు. ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు’ అని శ్రీకాంత్ అన్నాడు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!