IND vs AUS: టాస్ నెగ్గిన భారత్.. అయ్యర్, అశ్విన్ వచ్చేశారు! తిలక్‌కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India have won the toss and have opted to field vs Australia in 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం దక్కింది. అయితే తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు నిరాశే ఎదురైంది.
ఆస్ట్రేలియా పటిష్ట జట్టుతో బరిలోకి దిగుతోంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్.. భారత గడ్డపై సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు ఆసియా కప్ 2023 గెలిచి జోరు మీదున్న భారత్.. ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. వన్డే వరల్డ్‌కప్ 2023కి ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది.
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
తుది జట్లు:
భారత్: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా.
#TeamIndia have won the toss and elect to bowl first in the 1st ODI against Australia.
Live – https://t.co/H6OgLtww4N… #INDvAUS pic.twitter.com/s8Y71dRLMr
— BCCI (@BCCI) September 22, 2023
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!