ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం పీఆర్సీ పెంచడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇదేనా ఉద్యోగులను కడుపులో పెట్టుకునే చూసుకునే విధానమని విమర్శించారు. దేశంలోనే ధనిక రాష్ట్రంలో ఏమిటి దారుణమని ప్రశ్నించారు. వెంటనే 20% ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న మూడు డీఏల్లో రెండు డీఏలు వెంటనే క్లియర్ చేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఏడాదిగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే రివిజన్ కమిషన్ (PRC) ఏర్పాట్లు స్వాగతిస్తున్నామని.. అయితే ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పూర్తిగా ఖండిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Bus Accident: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. 50 మంది సేఫ్.. సినిమాను మించిన సీన్..!
ఏడాది పీఆర్సీ గడువు ముగిసిందని.. సాధారణంగా పీఆర్సీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించాల్సి ఉంటుందని భట్టి పేర్కొన్నారు. గడువు ముగిసిన మూడు నెలల తర్వాత పీఆర్సీ కమిటీలు ఏర్పాటు చేయడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన IR దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఈ ఐఆర్ ను ఉద్యోగులు ఎన్నడు చూడలేదన్నారు. ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసే పీఆర్సీలో ఈ శాతం దారుణంగా ఉందని భట్టి తెలిపారు.
Prabhas: రేయ్.. రేయ్.. ఎవర్రా ఆ పిల్ల.. ప్రభాస్ నే చెంప మీద కొట్టి అట్టా పారిపోయింది..
రాష్ట్రంలోని సుమారు 2.75 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, 2 లక్షల మంది పెన్షనర్లు పీఆర్సీని చూసి ఆశ్చర్యానికి గురయ్యారని భట్టి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించిన IR సవరించాలని.. 20% IR వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. పెండింగ్ లో ఉన్న మూడు డీఏల్లో రెండింటిని వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని భట్టి విక్కమార్క తెలిపారు.
