Hyderabad Metro: నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు..

  • నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు
  • కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి
Hyderabad Metro

Hyderabad Metro

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పడం లేదు. ఇటీవల మెట్రో ఛార్జీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నేటి నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది.

Also Read:IPL 2025: నేటి నుంచే ఐపీఎల్‌ పునః ప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్! కోహ్లీపైనే అందరి దృష్టి

2017లో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మెట్రో ప్రయాణానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు. కాగా మెట్రో ప్రారంభం అయినప్పటి నుంచి ఛార్జీల పెంపు ఇదే తొలిసారి. గత రేట్లతో పోల్చితే 20 శాతం పెరిగిన టికెట్ ధరలు.. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సులతో ఛార్జీలు పెంచిన L&T సంస్థ.. ఇప్పటివరకూ కనీస ఛార్జీ 10 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 12 రూపాయలకు పెరిగింది.. అలాగే గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుంచి రూ. 75 రూపాయలకు పెరిగింది. ఒకేసారి 20 శాతం రేట్లు పెంచడంతో మెట్రో రైలు ప్రయాణికులు మండిపడుతున్నారు.

Also Read:Kakinada: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

కొత్త ఛార్జీలు ఇవే:

2 స్టాప్‌లు వరకు కనీస ఛార్జీ రూ.12
2-4 స్టాప్‌ల వరకు రూ.18
4-6 స్టాప్‌ల వరకు రూ.30
6-9 స్టాప్‌ల వరకు రూ.40
9-12 స్టాప్‌ల వరకు రూ.50
12-15 స్టాప్‌ల వరకు రూ.55
15-18 స్టాప్‌ల వరకు రూ.60
18-21 స్టాప్‌ల వరకు రూ.66
24 స్టాప్‌లు.. ఆపైన రూ.75 వరకు పెంపు