Eatala Rajendar: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కేంద్రమంత్రులు..
- రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం
- ఈనెల 28న కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వేస్టేషన్
- సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి.. నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుంది- ఈటల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inauguration of Cherlapally Railway Station on 28th of this month.. Two Union Ministers to attend: మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఈనెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఈటల తెలిపారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వేస్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి.. నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుందని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విశాల ప్రదేశంలో ఏర్పాటు చేశామని ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కేంద్రం ముందుకు వచ్చి రైల్వే స్టేషన్‌కు రోడ్డు సౌకర్యం కల్పించి వేగవంతంగా పనులు పూర్తి చేసిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Read Also: Minister Nimmala Rama Naidu: అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే.. మరోసారి రుజువైంది..
Also Read
వారం రోజుల పాటు తమ నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్షించి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు ఎంపీ ఈటల తెలిపారు. డిసెంబర్ 28వ తేదీన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్‌ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Read Also: Minister Nadendla Manohar: సంక్రాంతి తర్వాత రోడ్ల నిర్మాణాలు ప్రారంభం
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..