Site icon NTV Telugu

Rs.500: దారుణం.. రూ.500 అప్పు తీర్చలేదని..

New Project (23)

New Project (23)

Rs.500: నేడు ప్రపంచమంతా మనీ మయమైంది. డబ్బు వెనకాలే మనిషి పరిగెత్తుతున్నాడు. మనీ కోసం మాన ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. రూపాయి పోతుందంటే ప్రాణం పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. తన రూపాయి కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. మనీ మాయలో పడి మానవత్వాన్ని మర్చిపోయాడు. అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వ్యక్తి అప్పుగా తీసుకున్న రూ.500 చెల్లించకపోవడంతో వ్యక్తి దారుణానికి ఒడికట్టాడు. అప్పు తీర్చలేదన్న కోపంలో కొట్టి చంపేశాడు. మాల్దా జిల్లాలోని బమంగోలాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడి పేరు బన్మాలి సనమ్. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని ప్రఫుల్లా రాయ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది.

Read Also: Immoral Relationship : తల్లిని అలా చూసి తట్టుకోలేక.. ఆమె ప్రియుడిని కొట్టి చంపేశారు

రూ.500 ప్రఫుల్లా రాయ్ నుండి బనమాలి సనమ్ అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని ప్రఫుల్ల పదే పదే అడిగేవాడు. కొన్ని కారణాల వల్ల డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఆదివారం కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రఫుల్ల బన్మాలి దగ్గరికి వెళ్లాడు. కానీ ఇప్పుడు చెల్లించలేనని బన్మాలి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ప్రఫుల్ల అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత బన్మాలి ఒక టీ దుకాణంలో కూర్చున్నాడు. ఈ సమయంలో ప్రఫుల్ల వెనుక నుంచి వెళ్లి వెదురుతో దాడి చేశాడు. ప్రఫుల్ల.. బన్మాలిని వెదురుతో దారుణంగా కొట్టాడు. ఇందులో బన్మాలి తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బన్మాలి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. బన్మాలిని అతని సోదరుడు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బన్మాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also : Payyavula Keshav: క్విడ్ ప్రోకో… షెల్ కంపెనీలకు పర్యాయపదం వైసీపీ

Exit mobile version