ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రెండు పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టగానే మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది.
Rs.500: నేడు ప్రపంచమంతా మనీ మయమైంది. డబ్బు వెనకాలే మనిషి పరిగెత్తుతున్నాడు. మనీ కోసం మాన ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. రూపాయి పోతుందంటే ప్రాణం పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు.