NTV Telugu Site icon

Etela Rajender: రాష్ట్రంలో రూ. 4 వేల కోట్లు వసూలు చేసి రాహూల్ గాంధీకి పంపిస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

New Project (14)

New Project (14)

గత ఆరు నెలలుగా తెలంగాణలో రూ. 4 వేల కోట్లు అక్రమంగా వసూలు చేసి, రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. పరకాలలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. “సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రే ఈ గడ్డ మీదకు వచ్చి ఈ ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని చెప్పాడంటే ఆలోచించండి. ప్రతీ ఒక్కరూ బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డికే ఓట్లు వేస్తామంటున్నారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏళ్లుగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదు. గతంలో కేసీఆర్ అన్యాయం చేసినందుకు ఇంటికి పంపించారు. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లుగా డీఏలు చెల్లించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ హామీలు నిలబెట్టుకోలేదు. ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హామీలు నిలబెట్టుకోలేనందుకు బుద్ది చెప్పాలి. నిజాలు తెలుసుకుని ఓటును సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరుతున్నాను.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. చేవేళ్ల ఠాణాలో కేసు నమోదు

ఎత్తిన జెండా దించకుండా, నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల కోసం పార్టీ కోసం జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అని ఈటల రాజేందర్ అన్నారు. “నల్గొండలో ఒక వ్యక్తి నడమంత్రపు సిరితో బీజేపీ ఎక్కడుంది అని అడిగాడు. 4 వ తేదీన తెలుస్తుందని చెప్పి వచ్చా. చాపకింద నీరులా తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటోంది. చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్లు, మనమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దీనిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రశ్నించే గొంతు అంటూ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు అధిష్టానం చేతిలో పిల్లిలా తయారయ్యారు. అధికార పార్టీలో ఉంటే ప్రశ్నించే అవకాశం ఉండదు. నేను పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమందితో భేటీలు, మీటింగులు నిర్వహించాను. అడ్వకేట్లతో, డాక్టర్లతో, నిరుద్యోగులతో, ఉపాధ్యాయులతో, ఉద్యోగులతో, అంగన్ వాడీలతో, ప్రైవేట్ ఉద్యోగులతో సమావేశాలు జరిగాయి. వారందరూ ఎన్నో బాధలు చెప్పుకున్నారు. శాసన సభలో కొట్లాడడానికి మనపార్టీ వాళ్లున్నారు. అలాగే శాసన మండలిలో కూడా ఏవీఎన్ రెడ్డి గారితో పాటు ప్రేమేందర్ రెడ్డి కూడా కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి బీజేపీ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది.” అని ఈటల పేర్కొన్నారు.
In the state Rs. 4 thousand crores are collected and sent to Rahul Gandhi