Site icon NTV Telugu

Team India: తొలి మ్యాచ్లోనే టాప్ ఆర్డర్ విఫలం.. తర్వాతి మ్యాచ్ల్లో పుంజుకుంటారా..?

Top Order

Top Order

2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో తలపడింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. టాప్ ఆర్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ సహా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు. అయితే తొలి మ్యాచ్‌లోనే టాప్‌ ఆర్డర్‌ విఫలమవడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.

Fastest century: ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు.. 29 బంతుల్లోనే సెంచరీ

నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2 ఓవర్లలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలోకి తీసుకెళ్లారు. విరాట్ కోహ్లి 85 పరుగులు, కేఎల్ రాహుల్ 97* పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకవేళ రాహుల్, కోహ్లీ ఇద్దరిలో ఎవరూ ఔటైన టీమిండియా.. పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకంటే వీరిద్దరి తర్వాత బ్యాటింగ్ కు దిగేది హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత రవీంద్ర జడేజా, ఆ తర్వాత అశ్విన్, చివరగా బుమ్రా, సిరాజ్, కుల్దీప్ బ్యాటింగ్ లో కనిపిస్తారు. అయితే హార్దిక్ తర్వాత.. ఏ ఆటగాడికి ప్రత్యేకమైన బ్యాటింగ్ సామర్థ్యం లేదు. జడేజా కూడా బ్యాటింగ్ లో రాణించలేకపోతున్నాడు.

Madhya Pradesh polls: బుద్నీ నుంచే సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ పోటీ..

సొంతగడ్డపై రవీంద్ర జడేజా ప్రభావవంతంగా లేడు. అతని బ్యాట్‌ నుంచి పరుగులు రాలేదు. గత పదేళ్లలో జడేజా భారతదేశంలో 26 వన్డేల్లో బ్యాటింగ్ చేశాడు. అందులో కేవలం 25.4 సగటుతో 406 పరుగులు చేశాడు. అశ్విన్ బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం బ్యాటింగ్ లో రాణించలేదు. 63 ODI ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన.. అశ్విన్ కేవలం 16.44 సగటుతో పరుగులు చేశాడు. ఇక కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ పరంగా దాదాపు సున్నా.

Exit mobile version