Paris Olympics 2024: టెన్నిస్ ఆటగాళ్లకు షాక్.. మొదటి రౌండ్ లోనే భారత్ అవుట్..
- టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న- శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు.
- తొలి రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్ఫిల్స్- ఎడ్వర్డ్ రోజర్ చేతిలో ఓటమి.
- 7-5 & 6-2 తో వరుస సెట్లలలో ఓడింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: భారతదేశానికి చెందిన అనుభవజ్ఞులైన టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. వారి నిష్క్రమణతో టెన్నిస్‌లో భారత్ సవాల్ ఒక్కరోజులోనే ముగిసింది. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత్ ఆటను మొదలు పెట్టింది. సింగిల్స్ లో సుమిత్ నాగల్, డబుల్స్‌లో బోపన్న – బాలాజీ జోడీ రంగంలోకి దిగింది. ఈ రెండింటిలోనూ భారత్ ప్రయాణం తొలి రౌండ్లోనే ముగిసింది. నాగల్ ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్ మౌటెట్‌తో ఓడిపోగా., బోపన్న – బాలాజీ జోడీ తొలి రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్ఫిల్స్, ఎడ్వర్డ్ రోజర్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
DoubleI Ismart: క్యా లఫ్డా అంటూ వచ్చేసిన రామ్, కావ్య థాపర్..
Also Read
తొలి రౌండ్లో బోపన్న, బాలాజీ జోడీని మోన్ఫిల్స్, వాసెలిన్ జోడీ చేతిలో 7-5, 6-2 తో వరుస సెట్లలలో ఓడింది. డబుల్స్ లో భారత్ క్యాంపెయిన్ 76 నిమిషాల్లో ముగిసింది. తొలి సెట్లో ఫ్రెంచ్ జోడీకి బోపన్న, బాలాజీ గట్టిపోటీని అందించగా., రెండో సెట్ లో భారత జోడీ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. చివరి క్షణంలో గాయపడిన ఫాబియన్ రెబల్ స్థానంలో వచ్చిన మోన్ఫిల్స్.. అద్భుతాలు చేశాడు. బోపన్నను సుదీర్ఘ ర్యాలీలో నిమగ్నం చేయాలనే ఫ్రాన్స్ వ్యూహం విజయవంతమైంది. దాని కారణంగా బాలాజీని పక్కన పెట్టారు. భారత జట్టు వెస్లిన్ సర్వీస్ ను బ్రేక్ చేసింది. అయితే ఈ జోరును కొనసాగించలేకపోయింది. దాంతో మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది.
Samsung Galaxy A06 Launch: ‘శాంసంగ్’ నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?