DoubleI Ismart: క్యా లఫ్డా అంటూ వచ్చేసిన రామ్, కావ్య థాపర్..
- రామ్ లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్
- ఆగస్టు 15న థియేటర్లలో విడుదల
- థర్డ్ సింగిల్ రిలీజ్ చేసిన నిర్మాత ఛార్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి రెండు సింగిల్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇస్మార్ట్ శంకర్ కు ఎంత ప్లస్ ఆయుందో ఇప్పుడు రానున్న డబుల్ ఇస్మార్ట్ కు అంతే ప్లస్ అవబోతుందని భావిస్తుంది యూనిట్. అందులో భాగంగానే ‘క్యా లఫ్డా’ అంటూ సాగే ఈ చిత్రంలోని మూడవ సింగిల్ కాసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్.
ధనుంజయ్ సీపాన మరియు సింధూజ శ్రీనివాసన్ రొమాంటిక్ టచ్‌తో పాడిన ఈ పాట వినసొంపుగా ఉంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం కూడా అంతే స్థాయిలో ఆకట్టుకుంది. పాట యొక్క ఆకర్షణీయమైన స్వభావానికి దోహదపడింది. ఈ సీజన్‌లో రొమాంటిక్ మెలోడీగా ‘క్యా లఫ్దా’ నిలుస్తుంది. ఈ పాటలో రామ్ మరియు కావ్యా థాపర్ మధ్య కెమిస్ట్రీ పాటకు మరింత ఆకర్షణ తెచ్చింది. టీజర్‌కు ప్రేక్షకుల నుండి అత్యుత్సాహకరమైన స్పందన లభించడంతో సినిమా విశేషమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లు మరియు ప్రమోషన్‌లతో హోరెత్తిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.
Also Read
- 'Dada' : 'దాదా' ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ నిర్మించిన ఈ అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటించారు. ఈ చిత్రానికి సామ్ కె నాయుడు మరియు జియాని జియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు. డబుల్ ఇస్మార్ట్ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోరిలీజ్ కానుంది.
Also Read: Tollywood : స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా.. సమ్మర్ 2025 విడుదల
- Tags
- doubleismart
- KyaLafda
- rapo
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి