NTV Telugu Site icon

MP: ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు.. 10 నెలల తర్వాత గుర్తింపు..

Mp News

Mp News

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్‌లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు. సంజయ్ తన స్నేహితుడు వినోద్‌తో కలిసి ప్రతిభను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో దాచాడు. దుర్వాసన రావడంతో 10 నెలల తర్వాత ఈ విషయం వెల్లడైంది.

READ MORE: Delhi Alert: ఢిల్లీకి ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన చేసిన ఐఎండీ

దేవాస్ ఎస్పీ పునీత్ గెహ్లాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ నోట్ ప్రెస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ ధామ్ కాలనీ ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్‌లో నివసిస్తున్నాడు. ఉజ్జయినిలోని మౌలానా గ్రామానికి చెందిన సంజయ్ పాటిదార్ తన లైవ్-ఇన్ భాగస్వామి ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతితో కలిసి ధీరేంద్ర శ్రీవాస్తవ ఇంట్లో జూలై 2023 నుంచి నివసిస్తున్నారు. సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేసాడు. కానీ ఇంట్లోని రెండు గదులు ఖాళీ చేయలేదు. తాను కొన్ని వస్తువులు ఉంచుకున్నానని, తర్వాత వచ్చి తీసుకెళ్తానని ఇంటి యజమానికి చెప్పాడు. నెలనెలా అద్దెను ఇండోర్‌లో నివసిస్తున్న యజమానికి ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నాడు.

READ MORE: HMPV Case : మరో హెచ్‌ఎంపీవీ కేసు.. 10 నెలల చిన్నారిలో బయటపడ్డ వైరస్!

అద్దెదారు సంజయ్ పాటిదార్ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఇటీవల కొత్త అద్దెదారు వచ్చాడు. కొత్తగా వచ్చిన వ్యక్తి తాళం వేసి ఉన్న రెండు గదుల తాళాలు ఇవ్వమని కోరాడు. ఇంటిని తెరిచి చూశారు. కానీ.. ఫ్రిజ్‌లో తీవ్ర దుర్వాసన వస్తోంది. అనుమానించిన ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇన్‌స్పెక్టర్ అమిత్ సోలం మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందని నిర్ధారించారు. ఈ హత్య 2024 జూన్‌లో జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.