Site icon NTV Telugu

India vs South Africa 1st ODI: రోహిత్-కోహ్లీ వీర బాదుడు.. రాహుల్ ఫినిషింగ్ టచ్.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్..!

India Vs South Africa

India Vs South Africa

India vs South Africa 1st ODI: రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు దక్షిణాఫ్రికాకు భారీ స్కోరు టార్గెట్ ను నిర్ధేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకోగా.. భారత బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకుని 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 భారీ స్కోరును నమోదు చేసింది. పరుగుల వర్షం మొదలుపెట్టిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కలిసి మంచి ఆరంభం ఇచ్చారు. అయితే యశస్వి (18) త్వరగా వెనుదిరిగినా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో 57 పరుగులు చేసి మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు వన్డే క్రికెట్‌లో మిస్టర్ కన్సిస్టెంట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను ప్రదర్శించారు. 120 బంతుల్లో 135 పరుగులు చేసిన కోహ్లీ 11 ఫోర్లు, 7 సిక్సులతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Parliament winter session: రేపటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..‘‘సర్’’పై ప్రతిపక్షాల పోరు..

అయితే ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) ఎక్కువసేపు నిలవలేకపోయినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ తన శైలిలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. 56 బంతుల్లో 60 పరుగులు చేశాడు రాహుల్. అలాగే చివర్లో రవీంద్ర జడేజా కూడా తనదైన శైలిలో 20 బంతుల్లో 32 పరుగులు చేసి స్కోరు మరింతగా పెంచాడు. భారత్ చివర్లో కొద్ది వికెట్లు కోల్పోయినప్పటికీ.. మొత్తం 50 ఓవర్లలో 349 పరుగులు నమోదు చేసి దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్, బర్గర్, బోష్, బార్ట్మన్ చెరో 2 వికెట్లు తీశారు. అయితే భారత బ్యాట్స్‌మెన్ దూకుడును ఆపలేకపోయారు. చుడాలిమరి దక్షిణాఫ్రికా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు ఎంతవరకు నిలువరిస్తారో.

సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ

Exit mobile version