NTV Telugu Site icon

Terrible Incident : కొట్టాడు.. తోశాడు.. చెక్కాడు.. చంపాడు

New Project (5)

New Project (5)

Terrible Incident : హర్యానాలో మానవత్వాన్ని కాలరాసే దారుణ ఘటన వెలుగు చూసింది. కట్నం కోసం భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త కట్నం తేవాలంటూ భార్యను చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని కొన్ని గంటలపాటు ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లో వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: Loan app fraud: లోన్‌ యాప్‌ పేరిట మోసం.. సిద్దిపేట, కరీంనగర్‌లో బాధితులు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీర్ సింగ్‌ ఢిల్లీలో క్యాటరింగ్ చేసేవాడు. అదే రాష్ట్రానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం ఢిల్లీలోనే వివాహమైంది. పెళ్లయిన తర్వాత బీర్ సింగ్ కట్నం కోసం భార్యను వేధించేవాడు. మహేరున్ నుంచి కట్నం తీసుకురావాలని భార్యను పదే పదే అడిగాడు. అయితే భార్య కట్నం తీసుకురాకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను చాలాసార్లు ఇంటిని గెంటేసేవాడు. కానీ మళ్లీ వెళ్లి అతను ఆమెను తిరిగి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలోనే బీర్ సింగ్ ఇంత దారుణమైన పని చేస్తాడని ఆ మహిళ కుటుంబం ఊహించలేదు. బిర్ తన భార్యను ముందుగా పైకప్పు నుండి కిందకు తోశాడు. ఈ తర్వాత ఆపై ఆమెను తీవ్రంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా పదునైన వస్తువుతో ఆమె చేతిపై తన పేరును టాటూగా చెక్కాడు. ఈ క్రమంలోనే ఆ దెబ్బలకు తాళలేక ఆమె కన్నుమూసింది.

Read Also:IPL 2023 : CSK పతనానికి అదే కారణం?.. “డాడ్స్ ఆర్మీ”కి మాథ్యూ హేడెన్ వార్నింగ్

బీర్ సింగ్‌ భార్యను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. అయితే తర్వాత ఏం చేయాలో అర్థంకాక పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show comments