NTV Telugu Site icon

Rajamahendravaram: ఏపీలో అరుదైన వివాహం.. వధువుకు 68.. వరుడికి 64

Ap News

Ap News

వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుడు… వృద్ధురాలు.. ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ… రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.

READ MORE: EPFO: పీఎఫ్‌లోని ఈ రూల్ ప్రకారం.. ఫ్రీగా రూ. 50 వేలు పొందే ఛాన్స్!

వారి కుటుంబాలు పట్టించుకోకపోవడంతో గత రెండేళ్లుగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. మూర్తికి పక్షవాతం రావడంతో రాములమ్మ అతనికి సేవలు చేసింది. ఇటీవల ఆయన కోలుకున్నాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలన్న కోరికను ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో వివాహానికి ఏర్పాటు చేసి అందరి సమక్షంలో వారిద్దరిని ఒకటి చేశారు. వివాహ వేడుకను నిర్వహించారు.

READ MORE: Kolkata Doctor Case: ‘‘నేను నేరం చేయలేదు, నన్ను ఇరికిస్తున్నారు’’.. కోర్టు నిందితుడి వాదన..