Veera Mass Title Fixed for NBK 109 Movie: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి వరుస హిట్ల మీద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ కెరియర్ లో 109వ సినిమా కావడంతో ప్రస్తుతానికి ఆ సినిమాని ఎన్బీకే 109 అని సంభోదిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వీరమాస్ అనే ఒక టైటిల్ రిజిస్టర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే అది ఈ సినిమా కోసమేనా లేక సితార సంస్థ నుంచి వస్తున్న వేరే సినిమా దేని కోసమైనానా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. బాబి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ మామూలుది కాదుగా.. ఏకంగా ఎక్స్ సీఎం మనవడితో పెళ్లి?
బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, చాందిని చౌదరి వంటి వాళ్లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెబుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ కూడా ఈ సినిమాలో భాగ స్వామిగా ఉంది. ఇక బాలయ్య అనే అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్న ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉండడంతో బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.