Site icon NTV Telugu

Bihar Crime: నర్సుతో డాక్టర్ అక్రమ సంబంధం.. ఆపై హత్య

Murder

Murder

బీహార్‌లోని నలందలో ఓ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తనతో పాటు పనిచేస్తున్న నర్సు ఆర్‌ఎంపీ డాక్టర్‌ను హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడు బెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకోల్‌కు చెందిన నిరంజన్ పాల్ (30)గా గుర్తించారు. సోమవారం సాయంత్రం అతనితో పనిచేసే ఓ నర్సు.. వైద్యుడిని తీసుకెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత తన కొడుకు హత్యకు గురైనట్లు సమాచారం అందిదని పేర్కొన్నారు.

Read Also: Golden Ticket: రజనీకాంత్ను వరించిన గోల్డెన్ టికెట్.. వరల్డ్ కప్ ప్రత్యేక అతిథుల జాబితాలో తలైవా

మృతుడు నిరంజన్ పాల్.. బెన్ బజార్‌లో జీవన్ జ్యోతి పేరుతో క్లినిక్ నడుపుతున్నాడు. అతని క్లినిక్‌లో ఓ నర్సు కూడా పనిచేస్తుంది. అయితే ఆ నర్సుతో డాక్టర్ గత 6 నెలలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై డాక్టర్‌.. ఆయన భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే సోమవారం అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందున్న బావిలో పడేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also: Womens Reservation Bill: లోక్‌సభ ముందు మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్రం

తన కొడుకును హత్య చేసింది నర్సు, తన కుటుంబ సభ్యులేనని మృతురాలి తల్లి ఆరోపించింది. తన కుమారుడిని నర్సు తీసుకెళ్లిందని.. ఆ తర్వాత హత్య చేశారని మృతురాలి తల్లి మాయాదేవి తెలిపారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. నర్సు, డాక్టర్‌ మధ్య ఎఫైర్ కారణంగా నర్సు మాజీ ప్రియుడు.. వారి ప్రేమ వ్యవహారాన్ని తట్టుకోలేక గన్ తో కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version