టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‍గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా..తన అందం, నటనతో ఎంతగానో మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆమె చేసిన చాలా చిత్రాలు బ్లాక్‍బాస్టర్ హిట్ అయ్యాయి. అయితే దాదాపు పదేళ్లుగా ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.ఈ క్రమంలో గతేడాది మైకేల్ డోలాన్‍ను తన జీవిత భాగస్వామి అని ఇలియానా వెల్లడించారు. ఇలియానా, మైకేల్ దంపతులకు గతేడాదే మగపిల్లాడు జన్మించారు. అతడికి కొయా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇలియానా తన భర్త, కుమారుడితో కలిసి అమెరికాలోనే ఉంటున్నారు. తన కుటుంబం, మాతృత్వం గురించి తరచూ ఆమె వెల్లడిస్తూ వస్తున్నారు. ఇన్‍స్టాగ్రామ్‍లో కూడా అప్పుడప్పుడూ పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాను గర్భంతో ఉన్న సమయంలో కూడా పని చేయాలని అనుకున్నానని.. ఇబ్బందులు ఏర్పడటంతో అలా చేయలేకపోయానని ఇలియానా తెలిపారు. బ్రేక్ తీసుకోకతప్పలేదని చెప్పారు. 2023 తనకు ఎంతో సంతోషకరమైన సంవత్సరమని, గర్భవతిగా ఉన్నప్పుడు తన తల్లి చాలా మద్దతుగా నిలిచారని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పారు. తన భర్త మైకేల్ డోలాన్ అద్భుతమైన వ్యక్తి అని.. తమ బలమైన బంధాన్ని పదాల్లో చెప్పలేనని అన్నారు.అయితే వీరికి పెళ్లి ఎప్పుడైందనే ప్రశ్నకు ఇలియానా నేరుగా సమాధానం చెప్పలేదు. రిలేషన్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు తనకు సందేహంగా ఉంటుందని, ఎందుకంటే తాను గతంలో ఈ విషయం గురించి నెగెటివ్ అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పారు.నా గురించి ఏదైనా అంటే నేను భరిస్తా.. కానీ నా జీవిత భాగస్వామిని, నా కుటుంబం గురించి దూషిస్తే మాత్రం నేను తట్టుకోలేను” అని ఇలియానా చెప్పారు.