వడ్డీ వ్యాపారం ముసుగులో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ తెలిపారు. మల్టీ జోన్ 1 పరిధిలో గత కొద్ది కాలంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారస్తులు ప్రజలకు రుణాల ను అందిస్తూ వారి నుండి అధిక మొత్తంలో వడ్డీలను వసూళ్ల కు చేస్తూ, డబ్బు చెల్లించని వారిని బలవంతంగా ఇల్లు, పొలాలకు సంబందించిన పత్రాలను బలవంతంగా తీసుకుంటున్నట్లుగా మల్టీ జోన్ పరిధిలో పలు పిర్యాదులు రావడంతో దీని పై స్పందించిన మల్టీ జోన్ 1 ఐజీ సంబందిత జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐజీ అదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ విభాగం పోలీసుల ద్వారా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై మల్టీ జోన్ ఐ జీ ఆదేశాల మేరకు ఆయా, ఆయా జిల్లాలో జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో
అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, ఫైనాన్స్ సంస్థల కేంద్రాలపై పోలీసుల దాడులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లు, వ్యాపార సంస్థల నుండి పెద్ద మొత్తం లో నగదు, బంగారం మరియు విలువైన డాక్యుమెంట్లు చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలును సంబందిత కోర్టుల్లో అందజేయడంతో పాటు, డబ్బును ఇన్ కంటాక్స్ అధికారులకు అందజేయబడుతుందని. ఈ దాడులకు సంబందించి మల్టీ జోన్ 1 ఐజీ మాట్లాడుతూ
ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు మరియు ఫైనాన్స్ సంస్థలు మోసపూరిత మాటల ద్వారా అమాయక ప్రజలను చూసి ఆర్థిక సహాయం చేస్తామని తెలుపుతూ వారి వద్ద నుండి ఇల్లు మరియు ప్లాటు వ్యవసాయ భూముల దస్తావేజులను తీసుకొని అప్పులు ఇస్తున్నారు. తిరిగి డబ్బులు చెల్లించాలని అధిక వడ్డీ రేట్ల లెక్కలు చూపుతూ చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ వారి ఆస్తుల దస్తావేజులను జప్తు చేసుకోవడం జరుగుచున్నది.
ఇలా వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక ఎంతోమంది బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి.బాధితులకు న్యాయం అందించాలనే ఉద్దేశంతోనే మోసపూరిత వ్యక్తులు ఫైనాన్సు సంస్థలపై పెద్ద మొత్తంలో దాడులు చేయడం జరిగింది. తనిఖీలలో పట్టుబడ్డ ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ప్రామిసరినోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్స్, పట్టా పాస్ బుక్కులు, చెక్కులు, ఏటీఎం కార్డ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యం ఎవరైనా వడ్డీ వ్యాపారస్తులు డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా సమాచారం వుంటే సంబందిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని. ఇట్టి విషయాల్లో ఏదైనా వివరాలు కావాల్సి వస్తే సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అవసరమగు విషయాలను తెలుసుకోవచ్చని మల్టీ జోన్ 1 ఐజీ ఓ ప్రకటన లో తెలియజేసారు.