NTV Telugu Site icon

Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!

Hair Care

Hair Care

తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరగడమే కాకుండా.. దాని ప్రభావం జుట్టు మీద కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి మరియు నల్లటి జుట్టును కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. అందుకోమని ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అంతేకాకుండా.. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటం కోసమని వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. అయితే మీరు మీ జుట్టు పొడవును పెంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో మనకు కరివేపాకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి, సి, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నూనె-కరివేపాకు
మీరు జుట్టు పెరుగుదలను పెంచుకోవాలనుకుంటే.. కొబ్బరి నూనెలో కరివేపాకును కలపండి. అందుకోసం ముందుగా బాణలిలో కొబ్బరి నూనె తీసుకుని అందులో 8 నుంచి 9 కరివేపాకు వేసి మరిగించాలి. బాగా చల్లారిన తర్వాత మీ తలకు, జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయండి. సుమారు గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.

కరివేపాకు-మెంతులు
జుట్టు ఒత్తుగా ఉండాలంటే కరివేపాకుతో పాటు మెంతి గింజలను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా కరివేపాకును పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల మెంతిపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. మీరు దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించవచ్చు.

కరివేపాకు-ఉసిరి
జుట్టు పెరగాలంటే కరివేపాకు, జామకాయతో హెయిర్ మాస్క్ తయారు చేసి అప్లై చేసుకోవచ్చు. అందుకోసం.. ఒక ఉసిరికాయను మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచా కరివేపాకు పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి సుమారు 1 గంట పాటు అలాగే ఉంచండి. ఈ హెయిర్ మాస్క్‌తో మీ జుట్టు పెరగడమే కాకుండా నిగనిగలాడుతుంది.