NTV Telugu Site icon

Ronald Ross: ఎన్నికల విధులకు హాజరు కాకుంటే కేసులే..

Ronald Ross

Ronald Ross

Ronald Ross: ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులతో పాటు సిబ్బందికీ టెన్షన్‌ మొదలైంది. ఎన్నికల విధుల నిమిత్తం ఎంపిక చేసిన సిబ్బంది శిక్షణకు గైర్హాజరవుతుండటంతో ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ,రొనాల్డ్‌ రోస్‌ హెచ్చరించారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో 23 వేల మంది సిబ్బందిని శిక్షణకు ఎంపిక చేస్తే 3700 మంది హాజరుకాలేదని మండిపడ్డారు. అనారోగ్యం, గర్భిణులు మినహా మిగిలిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ మూడు పార్లమెంట్లలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయిన్నట్లు తెలిపారు.

Read Also: UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!

ఇక, ఈనెల 18 నుంచి 25వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు చెప్పారు రొనాల్డ్‌ రోస్. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని పత్రాలు జత పరచాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉంటే కచ్చితంగా పత్రికల్లో ప్రచురించాలని సూచించారు. గతేడాది జిల్లాలో 45 శాతం మాత్రమే ఓటింగ్‌ అయిందన్నారు. ఈ సారి నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం చేశామని వెల్లడించారు. ఈ సారి మరో 10 శాతం పెంచెందుకు ఈ కార్యక్రమాలు దోహద పడతాయన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ధైర్యంగా ఓటేయాలన్నారు సూచించారు.