Site icon NTV Telugu

Robert vadra: వయనాడ్‌లో ప్రియాంక పోటీపై రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!

Prir

Prir

వయనాడ్‌ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక పోటీ చేయడాన్ని ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్వాగతించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయనాడ్‌లో రాహుల్‌ను ఆదరించినట్లుగానే.. ప్రియాంకను కూడా ఆదరిస్తారని తెలిపారు. ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేయడం చాలా సంతోషం అని తెలిపారు. వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను ప్రియాంక నెరవేరుస్తారని చెప్పారు. వయనాడ్ ప్రజలు ప్రియాంకను భారీ మెజార్టీతో గెలిపించి.. పార్లమెంట్‌కు పంపాలని ప్రజలకు రాబర్ట్ వాద్రా విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఎప్పుట్నుంచో ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆమె పోటీ చేయలేదు. ప్రచారంలో మాత్రం ప్రియాంక దూసుకుపోయారు. అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి తరపున అభ్యర్థులకు ప్రచారం చేశారు. అయితే రాహుల్ గాంధీ తాజాగా జరిగిన ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే రాహుల్.. వయనాడ్ సీటును వదులుకున్నారు. దీంతో ప్రియాంక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. వయనాడ్ నుంచి ప్రియాంకను దించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే రాహుల్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ భారీ విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Crime News: దారుణం.. కవల ఆడపిల్లలు పుట్టారని చంపేసిన తండ్రి

Exit mobile version