NTV Telugu Site icon

PM Modi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు..?

Modi

Modi

Narendra Modi: ఏడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీహార్‌లోని పాటలీపుత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. భారత్‌ను అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇండియా కూటమి రాత్రి పగలు మోడీని విమర్శించడంలో బిజీగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోడీ, మరోవైపు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడంలో పని చేస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Read Also: Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ అదిరిపోయిందిగా..

కాగా, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పైనా నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్‌ఈడీ బల్బుల కాలంలో బీహార్‌లో లాంతరు కూడా ఉండేదన్నారు. లాంతర్ ఒక ఇంటిని మాత్రమే వెలిగిస్తుంది. కానీ, బీహార్ మొత్తం ప్రస్తుతం చీకట్లోనే ఉంది.. లాంతరు వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రపంచం ముందు తన అభిప్రాయాలను బలంగా అందించగల ప్రధాని భారతదేశానికి అవసరం.. ఇండియా కూటమి 24 గంటలు అబద్దాలు ప్రచారం చేస్తోంది.. వారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులను మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Show comments