పెళ్లి అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనా అంశం..వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటేనే బంధం బలంగా ఉంటుంది. లేకుంటే ఎప్పుడు గొడవలు చికాకులు వస్తూనే ఉంటాయి.కొన్ని సందర్భాల్లో ప్రేమకు బదులు భయం, ద్వేషం పెరుగుతాయి.. కొన్నిసార్లు మనస్పర్థలు వస్తే విడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి… అసలు గొడవలు రావడానికి కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. భర్తకు కొన్ని లక్షణాలు ఉంటే ఆడ వాళ్ళు ఎప్పటికి దగ్గరకు రారట.. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
*. ఆడవాళ్లు చాలా సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు..స్త్రీని మానసికంగా ఇబ్బంది పడేలా చేస్తాయి ఈ వేధింపులు. దీంతో ఆమె జీవితాంతం వాటి నుంచి కోలుకోలేదు..ఇలాంటి భర్త నాకొద్దు అని దూరం పెడతారు..
*. భార్యను కొట్టే భర్తని ఏ భార్య ఇష్టపడుతుందో చెప్పండి. గృహ హింసని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. దీనికి వ్యతిరేకంగా చట్టాలు కూడా ఉన్నాయి.. కొడితే ప్రేమ అనేది ఎలా ఉంటుంది..
*. వేరే స్త్రీ తో సంబంధం పెట్టుకోవడం ఈ ఆడది సహించదు.. ప్రేమలు కురిపించే భార్య అయిన సరే ఈ విషయాలు తెలిస్తే అసలు పొరపాటున కూడా క్షమించదు..
*. భార్యాభర్తల మధ్య అంతా బానే ఉంటుంది. కానీ, తండ్రిగా ఓ వ్యక్తి పిల్లలని హింసించినప్పుడు అలాంటి ప్రవర్తనని ఏ స్త్రీ కూడా సహించదు.. అలా ఉంటే పిల్లలను దూరంగా పెంచాలని అనుకుంటుంది.. ఇలాంటి లక్షణాలు ఉన్న భర్తలను దగ్గరకు కూడా రానివ్వరు.. గుర్తుంచుకోండి..