NTV Telugu Site icon

Cyber Fraud: అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు..! ట్విస్ట్ ఏంటంటే..?

Cyber Fraud

Cyber Fraud

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. మౌయిమా ప్రాంతంలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్‌లో ఒక వినియోగదారు.. ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఈ ఆఫర్ చూసి ఓ యువకుడు ట్రాప్‌లో పడ్డాడు. దీంతో.. సైబర్ దుండగులు అతడిని సంప్రదించి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.24800 కట్టించుకున్నారు. ఆ తర్వాత రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. తాను మోసపోయానని బాధిత యువకుడు గ్రహించాడు.

Maharashtra Navnirman Sena: పదేళ్ల తర్వాత భారత్‌లో పాకిస్థాన్ సినిమా.. తన్నులు తప్పవు!

ఈ ఘటన మౌయిమాలోని బక్రాబాద్ ప్రాంతంలో జరిగింది. అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో ఈ ప్రకటనను చూశాడు. అందులో ధనిక కుటుంబాల అమ్మాయిలను గర్భవతిని చేసే ఉద్యోగం ఉందని, ఐదు లక్షల రూపాయల జీతంతో పాటు విలాసాలు కల్పిస్తామని అందులో రాసుంది. ఈ క్రమంలో.. యువకుడు అందులో నంబర్‌కు ఫోన్ చేయగా.. అడ్వర్టైజర్ మొదట రూ.800 కట్టాలని చెప్పాడన్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషకు రూ.24 వేలు పంపించాడు. అడ్వర్టైజర్లు మళ్లీ యువకుడి నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. అయితే.. అసలు విషయాన్ని బాధితుడు తెలుసుకుని మోసపోయానని గ్రహించాడు.

Harassment: అత్తమామల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని అల్లుడు సూసైడ్

సైబర్ మోసగాళ్లు ఎస్పీ, డీఎస్పీల ప్రొఫైల్ ఫోటోలు ఉన్న నంబర్లతో కాల్ చేసి డబ్బు చెల్లించాలని బాధిత యువకుడిని టార్చర్ చేశారు. లేదంటే.. కేసు నమోదు చేసి ఇరికిస్తామని బెదిరించారు. దీంతో యువకుడు భయపడి గ్రామ సామాజిక కార్యకర్తకు విషయం చెప్పాడు. అనంతరం.. బాధితుడు సైబర్ క్రైమ్ ప్రయాగ్‌రాజ్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి డబ్బులు తిరిగి ఇప్పించాలని డీసీపీ క్రైం బాధితుడు కోరాడు. అయితే.. ఇంతకుముందు కూడా చాలా మంది యువకులు ఇలానే మోసపోయారని.. ఈ క్రమంలో అవమానానికి భయపడి వారు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.