NTV Telugu Site icon

Shabbir Ali: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు

Shabbir Ali

Shabbir Ali

కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొని.. షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా అధికార బీఆర్ఎస్.. ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందని ఆయన తెలిపారు.

Read Also: Anasuya Bharadwaj: ‘బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌’గా మారిపోయిన అనసూయ భ‌రద్వాజ్

మరోవైపు జనాల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై అసంతృప్తి నెలకొందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మైనార్టీలు, దళితులు, వెనుకబడిన తరగతులు సహా వివిధ వర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వదిలేశారని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వంటగ్యాస్ సిలిండర్లను రూ.500లకు విక్రయిస్తున్నారనీ, తెలంగాణలో ధరలు మండిపోతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also: Dhanush: స్కూల్ ఫ్రెండ్స్ తో స్టార్ హీరో రీయూనియన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

అంతేకాకుండా.. రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేక డిక్లరేషన్లు విడుదల చేయడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారనే వార్తలపై స్పందించిన ఆయన.. పోటీని స్వాగతిస్తానని చెప్పారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆయన పేర్కొన్నారు.