NTV Telugu Site icon

Ponguleti Srinivasa Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది

Ponguleti

Ponguleti

నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. “గడిచిన పదేళ్లలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ కు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చింది.. గాడిద గుడ్డు తప్ప. కులాల మధ్య, ప్రాంతాల మధ్య లింక్ పెడుతూ ద్వేషాన్ని రెచ్చగొట్టింది బీజేపీ. ఈ సారి అధికారం లోకి వస్తె భారత రాజ్యాంగంను మారుస్తామని ప్రధాని మోడీ అనేక వేదికల్లో చెపుతున్నారు. బీజేపీ అధికారం లోకి వస్తె భారత రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశ ప్రజల క్షేమం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసింది. అందరి బాగోగుల కోసం, దేశం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. రాజకీయ లబ్ధికోసమే, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద చెడు ప్రచారం చేస్తున్నారు. కర్ర పట్టుకుని కేసీఆర్ జనం లోకి వస్తున్నారు. నామ నాగేశ్వరరావు ను కేంద్రం లో మంత్రి ఎలా చేస్తారు అని అడిగాము. అక్రమంగా సంపాదించిన లక్షా యాభై వేల కోట్లను దాచుకునేందుకు, కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నాడు. మొదటి నుండి కాంగ్రెస్ చెపుతుంది..బీజేపీ తొత్తు పార్టీ బీఆర్ఎస్ అని.”

READ MORE: Samantha Vs Sobhita: ఇదేంటి సోషల్ మీడియాలో ఇంత డైరెక్టుగానా?

అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల కార్డ్ లు,పెన్షన్ లు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. “డబల్ బెడ్ రూమ్ లు అనే బొమ్మను చూపించి రెండు సార్లు కేసీఆర్ ఓట్లు వేయించుకున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ళను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత అందరం వచ్చి ముగ్గు పోసే కార్యక్రమం చేపడతాం. ఇది మాటల ప్రభుత్వం కాదు…చేతల ప్రభుత్వం. ఇచ్చిన హామీల పట్ల చిత్త శుద్ధితో ప్రభుత్వం పని చేస్తుంది. ఆగస్టు 15 లోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి మంచి మెజారిటీ తో గెలిపించాలి.”

“ఎవరెన్ని కుట్రలు పన్నినా,కుయుక్తులు పన్నినా ఈ ప్రభుత్వం లో కూడా మంత్రిగా ఉండే అవకాశం మీ వల్లే దక్కింది. మేము ఎంత మంది ఉన్న డిల్లీలో పనులు ఉంటాయి. అందుకోసమే రామ సహాయం ను గెలిపించాలి. లంకాసాగర్ కు ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను తీసుకువస్తాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తూనే రెండు,మూడు నెలల్లో రుణ మాఫీ చేస్తాం. సంక్షేమ పథకాలు పేద వాళ్లకు చేరుతున్నాయో లేదో ఎమ్మెల్యే చూసుకోవాలి. ముఖ్యమంత్రి సహకారం తో మీకు కావల్సిన పనులను పూర్తి చేస్తాం.”