Tirumala: తిరుమల నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల నడక మార్గంలో గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేయడం కలకలం రేగింది.. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే కాగా.. టీటీడీ చరిత్రలోనే ఇది తొలి ఘటనగా నిలిచిపోయింది.. అయితే, ఆ లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించారు అటవీశాఖ అధికారులు.. ఇప్పటికే బంధించిన నాల్గో చిరుతే.. చిన్నారి లక్షిత పై దాడి చేసినట్లు గుర్తించారు.. ఇక, ఈ ఘటన తర్వాత మొత్తం ఆరు చిరుతలను టీటీడీ – ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో బంధించిన విషయం విదితమే.. మరోవైపు.. లక్షితపై దాడి చేసిన చిరుతను జూపార్కులోనే సంరక్షించాలని నిర్ణయించింది టీటీడీ..
Read Also: Ntr : గోవాకు ఎన్టీఆర్.. న్యూ లుక్ అదుర్స్..!
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
కాగా, గత ఏడాది ఆగస్టు 11వ తేదీన చిన్నారి లక్షిత(6)పై చిరుత దాడి చేసిన విషయం విదితమే కాగా.. ఆగస్టు 28వ తేదీన నాల్గో చిరుతను బంధించారు అటవీశాఖ అధికారులు.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేష్-శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి 11వ తేదీన రాత్రి 7.30 ప్రాంతంలో అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే, లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం వద్దకు చేరుకొనే సరికి అకస్మాత్తుగా ఓ చిరుత చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లింది. ఊహించని ఘటనలో షాక్ తిన్న తల్లిదండ్రులు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు సాధ్యం కాలేదు. అయితే, 12వ తేదీన ఉదయం లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయానికి సమీపంలో పోలీసులకు బాలిక మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలోనే చిన్నారి మృతిచెందినట్టు అప్పుడే గుర్తించగా.. ఇప్పుడు ఆ చిన్నారిపై దాడి చేసిన చిరుతను కూడా గుర్తించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!