Fixed Deposit Scheme: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని ఎవరైనా అనుకుంటారు.. అయితే, బయట వడ్డీలకు తిప్పితే బాగానే సంపాదించవచ్చు.. కానీ, ఆ డబ్బులు తిరిగి వస్తాయా? అంటే గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి.. దీంతో.. తక్కువ వడ్డీ అయినా.. వినియోగదారులు బ్యాంకులను ఆశ్రయిస్తారు.. ఎక్కువ వడ్డీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల స్కీమ్‌లను పరిశీలిస్తుంటారు.. అయితే, తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నవారికి అదిరిపోయే వార్త చెప్పింది ఐడీబీఐ బ్యాంక్ .. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్డీ స్కీమ్‌ను తీసుకొచ్చింది.. ఈ తాజా స్కీమ్ ఈ నెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.. ఈ కొత్త ఎఫ్డీ పథకం ద్వారా సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది ఐడీబీఐ.
ఐడీబీఐ యొక్క అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఎఫ్డీ స్కీమ్‌లను తీసుకొచ్చింది.. 375 రోజుల, 444 రోజుల ఎఫ్డీ స్కీమ్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయంటూ సదరు బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది. 375 రోజుల స్కీమ్ కింద సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుండగా.. అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ 444 రోజుల స్కీమ్ ద్వారా గరిష్టంగా 7.65 శాతం వడ్డీని అందిస్తోంది.. ఇక, సీనియర్ సిటిజన్లకు గరిష్ట రేటు 7.75 శాతంగా వడ్డీ అందించనున్నట్టు ఐడీబీఐ పేర్కొంది..
444 రోజుల ఎఫ్డీ స్కీమ్‌లో 7.25 శాతం సాధారణ పౌరులకు.. 7.75 శాతం సీనియర్ సిటిజన్లకు వడ్డీ అందించనున్నట్టు ఐడీబీఐ పేర్కొంది. ఇక, IDBI బ్యాంక్ ఏడు రోజుల నుండి ఐదు సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 3 శాతం నుండి 6.5 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రేట్లు జులై 14, 2023 నుండి అమలులోకి వచ్చాయి.. 07-30 రోజులు 3 శాతం,
31-45 రోజులకు 3.25 శాతం.. 46- 90 రోజులకు 4 శాతం, 91-6 నెలల కాలానికి 4.50 శాతం, 6 నెలల 1 రోజు నుండి ఏడాది కాలానికి 5.75 శాతం, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు (375 రోజులు మరియు 444 రోజులు మినహా) 6.80 శాతం, 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు 6.50 శాతం, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు 6.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక, ఏడు రోజుల నుండి ఐదు సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుండి 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.