NTV Telugu Site icon

CWC 2023: టీమిండియాకు కలిసిరాని రౌండ్ రాబిన్ ఫార్మాట్.. ఆందోళనలో ఫాన్స్!

India Odi

India Odi

Team India scared about World Cup 2023 Round Robin Format: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం.. ప్రతీ జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-4‌లో నిలిచిన 4 జట్లు నాకౌట్‌కు (సెమీ ఫైనల్) అర్హత సాధిస్తాయి. పాయింట్స్ టేబుల్లో 1,4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. 2,3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో రౌండ్ రాబిన్ పద్దతిలో టోర్నీ జరగడం ఇది మూడోసారి మాత్రమే. 1992, 2019లో మాత్రమే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రపంచకప్ టోర్నీ జరిగింది. ఈ రెండుసార్లు భారత్ విజేతగా నిలవలేకపోయింది. 1992లో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడినప్పుడు భారత్ నాకౌట్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక 2019లో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడి సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. 2019లో టైటిల్ ఫెవరెట్ అయినా.. న్యూజిలాండ్ చేతిలో ఓడి అభిమానులను నిరాశపరిచింది.

గత రికార్డులే ఇప్పుడు టీమిండియాను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 1992, 2019 రికార్డ్స్ చూసి అభిమానులను ఆందోళన చెందుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్స్ వచ్చే అయితే ప్రపంచకప్ ఆడుతారో లేదో తెలియదు. అందుకే ఫాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నాకౌట్‌కు చేరేందుకు ప్రతీ జట్టుకు మంచి అవకాశాలు ఉంటాయి. 1,2 మ్యాచ్‌లో ఓడినా.. మిగతా మ్యాచ్‌లో పుంజుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. చూడాలి మరి ఈసారి భారత్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌ భయాలను తొలగిస్తుందో.

Also Read: WhatsApp LPG Gas Booking: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. గ్యాస్ సిలిండర్‌ ఇంటికి వచ్చేస్తుంది!

వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తన ప్రయాణాన్ని అక్టోబర్‌ 8న ఆరంభిస్తుంది. పటిష్ట ఆస్ట్రేలియాతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న దాయాదీ పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ప్రపంచకప్లలో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది. అదే కంటిన్యు చేయాలని టీమిండియా చూస్తోంది.

భారత్ మ్యాచ్‌లు:
ND vs AUS, అక్టోబర్ 8, చెన్నై
IND vs AFG, అక్టోబర్ 11, ఢిల్లీ
IND vs PAK, అక్టోబర్ 15, అహ్మదాబాద్
IND vs BAN, అక్టోబర్ 19, పూణే
IND vs NZ, అక్టోబర్ 22, ధర్మశాల
IND vs ENG, అక్టోబర్ 29, లక్నో
IND vs Qualifier 2, నవంబర్ 2, ముంబై
IND vs SA, నవంబర్ 5, కోల్‌కతా
IND vs Qualifier 1, నవంబర్ 11, బెంగళూరు

Also Read: Today Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్స్ ఇవే!