CWC 2023: టీమిండియాకు కలిసిరాని రౌండ్ రాబిన్ ఫార్మాట్.. ఆందోళనలో ఫాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India scared about World Cup 2023 Round Robin Format: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం.. ప్రతీ జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-4లో నిలిచిన 4 జట్లు నాకౌట్‌కు (సెమీ ఫైనల్) అర్హత సాధిస్తాయి. పాయింట్స్ టేబుల్లో 1,4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. 2,3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో రౌండ్ రాబిన్ పద్దతిలో టోర్నీ జరగడం ఇది మూడోసారి మాత్రమే. 1992, 2019లో మాత్రమే రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రపంచకప్ టోర్నీ జరిగింది. ఈ రెండుసార్లు భారత్ విజేతగా నిలవలేకపోయింది. 1992లో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఆడినప్పుడు భారత్ నాకౌట్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక 2019లో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఆడి సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. 2019లో టైటిల్ ఫెవరెట్ అయినా.. న్యూజిలాండ్ చేతిలో ఓడి అభిమానులను నిరాశపరిచింది.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
గత రికార్డులే ఇప్పుడు టీమిండియాను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 1992, 2019 రికార్డ్స్ చూసి అభిమానులను ఆందోళన చెందుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్స్ వచ్చే అయితే ప్రపంచకప్ ఆడుతారో లేదో తెలియదు. అందుకే ఫాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నాకౌట్‌కు చేరేందుకు ప్రతీ జట్టుకు మంచి అవకాశాలు ఉంటాయి. 1,2 మ్యాచ్‌లో ఓడినా.. మిగతా మ్యాచ్‌లో పుంజుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. చూడాలి మరి ఈసారి భారత్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ భయాలను తొలగిస్తుందో.
Also Read: WhatsApp LPG Gas Booking: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది!
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తన ప్రయాణాన్ని అక్టోబర్ 8న ఆరంభిస్తుంది. పటిష్ట ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న దాయాదీ పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది. అదే కంటిన్యు చేయాలని టీమిండియా చూస్తోంది.
భారత్ మ్యాచ్‌లు:
ND vs AUS, అక్టోబర్ 8, చెన్నై
IND vs AFG, అక్టోబర్ 11, ఢిల్లీ
IND vs PAK, అక్టోబర్ 15, అహ్మదాబాద్
IND vs BAN, అక్టోబర్ 19, పూణే
IND vs NZ, అక్టోబర్ 22, ధర్మశాల
IND vs ENG, అక్టోబర్ 29, లక్నో
IND vs Qualifier 2, నవంబర్ 2, ముంబై
IND vs SA, నవంబర్ 5, కోల్‌కతా
IND vs Qualifier 1, నవంబర్ 11, బెంగళూరు
Also Read: Today Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్స్ ఇవే!
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!