ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం.. 2వ స్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధానా.!
- ఐసీసీ తాజా మహిళల టీ20 ర్యాంకింగ్స్ విడుదల..
- 2వ రాంక్ లో స్మృతి మంధానా..
- హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ స్థానానికి
- షెఫాలీ వర్మ 6వ స్థానంలో..
- జెమిమా రోడ్రిగ్స్ 11వ స్థానంలో
- బౌలింగ్‌లో మూడో స్థానానికి ఎగబాకిన దీప్తి శర్మ
- ఆల్‌రౌండర్ విభాగంలో కూడా దీప్తి శర్మ 3వ స్థానంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 Rankings: తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా తన 2వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచింది. భారత్ కు చెందిన మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 6వ స్థానంలోనే కొనసాగుతూ టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక జెమిమా రోడ్రిగ్స్ మాత్రం 11వ స్థానంతో సరిపెట్టుకుంది.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
బ్యాటర్స్ ఇలా ఉంటే.. బౌలింగ్ విభాగంలో మాత్రం ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకుంది. అంతేకాదు.. ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా ఆమె మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈమె తర్వాత ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ ఆరవ స్థానాన్ని నిలబెట్టుకోగా.. అరుంధతి రెడ్డి ఒక స్థానం కోల్పోయి 11వ స్థానానికి చేరుకుంది. ఇక బ్యాటర్స్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మోని 793 పాయింట్స్ తో తన మొదటి స్థానాన్ని కాపుడుకుంది.
Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!
బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పాకిస్థాన్ ప్లేయర్ సాదియా ఇక్బాల్ 743 పాయింట్స్ తో తన మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక వెస్టిండీస్ ప్లేయర్ హేలె మ్యాత్యుస్ 465 పాయింట్స్ తో మొదటి తనంలో కొనసాగుతుంది. ఇక 294 రేటింగ్ పాయింట్స్ తో ఆస్ట్రేలియా జట్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండగా.. 268 రేటింగ్ పాయింట్స్ తో టీమిండియా జట్టు ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో కొనసాగుతుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?