ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇందులో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్ (DRS) పద్దతి ఎంతో పాపులర్ అయింది. అయితే, త్వరలోనే ఇదే తరహాలో మరో కొత్త రూల్ క్రికెట్‌లో భాగం కాబోతుంది. ఇన్నాళ్లు ప్రయోగ దశలోనే ఉన్న స్టాప్ క్లాక్ రూల్ (Stop Clock Rule)ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC ) దాన్ని ఇకపై శాశ్వతం చేయనుంది. జూన్‌లో వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024)తో ఈ రూల్ ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా తెలియజేసింది.
Read Also: PM Modi: సౌత్ ఇండియాపై బీజేపీ నజర్.. మూడు రాష్ట్రాల్లో ప్రధాని సూడిగాలి పర్యటన..
ఇక, గత ఏడాది డిసెంబర్ నుంచి స్టాప్ క్లాక్ రూల్‌ను ఐసీసీ ప్రయోగాత్మకంగా పలు మ్యాచుల్లో అమలు చేసింది. ఈ రూల్ బాగా వర్కౌవుట్ కావడంతో ఐసీసీ దీన్ని శాశ్వతంగా అమలు చేసేందుకు రెడీ అయింది. ఇంతకు ఈ రూల్ ఏంటంటే..? ఓవర్లకు ఓవర్లకు మధ్య ఎలక్ట్రానిక్ గడియారాన్ని చూపిస్తారు.. నిర్ణీత సమయం లోపు ఓవర్ల కోటా పూర్తి చేసేలా ఇరు జట్ల కెప్టెన్లను ఈ కొత్త నిబంధన అలర్ట్ చేస్తుంది. అంతే కాదు ఫీల్డింగ్ టీమ్ కు ఓవర్ల మధ్య 60 సెకన్ల టైం ఉంటుంది. స్టాప్ క్లాక్‌లో సున్నా వచ్చేంత వరకు మరో బౌలర్ ఓవర్ వేయాల్సిందే. ఇలా వన్డేలు, టీ20ల్లో ప్రతి ఓవర్ తర్వాత స్టాప్ క్లాక్‌ను చూపించనున్నారు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు కొత్త ఓవర్ వేయకపోతే పెనాల్టీ విధించనున్నారు.
Read Also: Viral Video: శివ శివ.. అంటూ శివునికే నామం పెట్టిన దొంగ..!
అయితే, స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది. ఓవర్ పూర్తికాగానే థర్డ్ అంపైర్ టైమర్ ఆన్ చేయనున్నారు. 60 సెకన్ల లోపు బౌలింగ్ టీమ్ కొత్త ఓవర్ వేయనుంది. ఒకవేళ అలా చేయలేకపోతే ఫీల్డ్ అంపైర్ రెండు సార్లు వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే నిర్ణయ సమయంలోపు ఓవర్ వేయకపోతే చివరకు ఐదు రన్స్ పెనాల్టీ విధించనున్నారు.